దోపిడీ కి రైల్వే సిద్దం .. లోయర్ బర్త్ కోసం డబ్బులు వసూలు ?

రైల్వే డిపార్ట్ మెంట్ ఇప్పుడు ఏ రకంగా ప్రయాణీకుల నుంచి సొమ్ములు వసూలు చెయ్యలా అని చూస్తోంది. తాజాగా రైలు ప్రయాణం చేసే టప్పుడు ఎవ్వరైనా సరే లో బెర్త్ మీదనే ఎక్కువ దృష్టి పెడతారు ఆ సీటు దక్కాలని కోరుకుంటారు కూడా దానికి సంబంధించి ఇప్పుడు దోచుకునే కార్యక్రమం పెట్టింది రైల్వే సంస్థ. లోయర్ బెర్త్ కావాలనుకునే వారి నుంచి అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేయాలని భావిస్తోంది.

అయితే ఎంత మొత్తం అన్నది ప్రస్తుతానికి ఖరారు కాలేదు. త్వరలోనే రైల్వే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. లోయర్ బెర్త్ న్ని ఎక్కువగా పిల్లలు , వృద్ధులు , మహిళల కి కేటాయించే వారు . సర్ చార్జ్ పేరుతో అదనంగా వసూలు చెయ్యడం అంటే పలు విమర్శలు వస్తున్నాయి. దేశం లో మొత్తం అన్ని రైళ్ళ లో లోయర్ బర్త్ ని ప్రెజెంట్ ఒక పదిహేను శాతం సీనియర్ సిటిజెన్ లకి కేటాయిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here