పవన్ ఫాన్స్ – అల్లూ ఫాన్స్ మధ్యలో అతను నలిగిపోతున్నాడు

డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫాన్ అని అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా తో పవన్ ఫాన్స్ తమ హీరోని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడు హరీష్. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం అంటూ అల్లూ అర్జున్ తో రాబోతున్నాడు మన డైరెక్టర్ బాబు. కానీ పవన్ ఫాన్స్ – అల్లూ ఫాన్స్ మధ్య గొడవల్లో హరీష్ నలిగి పోతున్నాడు అని సమాచారం.

దువ్వాడ జగన్నాథమ్‌’ వీడియో ఏది బయటకి వచ్చినా కానీ డిస్‌లైక్స్‌ కొడుతూ తమ కసి చూపెడుతున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకుడు కదా అని ఏమాత్రం లైట్‌ తీసుకోవడం లేదు. దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియో వేడుక లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ రచ్చ ని తీసుకుని రాబోతున్నారు.పవన్‌ పేరు ఎత్తకుండా, ఇంకాస్త కాంట్రవర్సీ కాకుండా అల్లు అర్జున్‌ జాగ్రత్త పడవచ్చు కానీ హరీష్‌ శంకర్‌ మాట దాటేయడం కాస్త కష్టమే.

హరీష్ మైకు తీసుకోగానే పవన్ ఫాన్స్ ఖచ్చితంగా కేరింతలు కొడుతూ తమ హీరో గురించి మాట్లాడాలని కోరతారు అని అందరికీ తెలిసిన విషయమే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here