వాళ్లకు సుఖమే కావాలి.. వాడుకుంటారు: లక్ష్మీరాయ్

లక్ష్మీ రాయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు, దర్శకులకు.. అమ్మాయిలను ఆడుకోవడమే పని అని.. వారితో సుఖాలు అనుభవించడమే ఇష్టమని బాంబ్ పేల్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాళ్లతో పాటు.. అవకాశాలు తగ్గిపోయిన హీరోయిన్లపై.. ఇలాంటి వాళ్ల కన్ను పడుతుంటుందని ఓపెన్ గా చెప్పేసింది.

వాళ్ల ఆనందం కోసం.. పేరున్న సెలెబ్రిటీలను కూడా వదలరని.. అలాంటి వాళ్ల చేతుల్లో పడితే.. నరకమే అని లక్ష్మీ రాయ్ అంటోంది. ఇలాంటి పరిస్థితి.. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది.. అని చెప్పింది. అయితే.. తనకు మాత్రం అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని.. ఆ విషయంలో తాను మాత్రం కాస్త అదృష్టవంతురాలినే అని చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here