ర‌జ‌నీకోసం మోడీ లాబీయింగ్?

రాజకీయాల్లోకి రజనీ బాబా వస్తారా.. రారా.. మూడు రోజుల పాటూ ఫాన్స్ తో మంతనాలు జరిపినా.. తలైవా ఎటూ తేల్చుకోలేనట్లుగానే కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావాలని లేదని,కానీ దేవుడు ఆదేశిస్తే రాక తప్పదంటూ రొటీన్ ఆన్సర్ ఇచ్చారు.. ఇంతకీ రజనీ చెప్పీ చెప్పనట్లుగా చెబుతున్న ఆ మాటల అంతరార్ధం ఏంటి?
ర‌జ‌నీ త‌న న‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా వెల‌క‌ట్టలేని అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈయ‌న పొలిక‌ల్ రంగ‌ప్ర‌వేశం పై డైల‌మాలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. పాలిటిక్స్ పై ఎప్ప‌టిక‌ప్పుడు హింట్ ఇస్తూనే అదేం లేదు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే ర‌జ‌నీ డైలామా ఉన్న‌ట్లు పొలిట‌క‌ల్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకు ఊతం ఇస్తూ త‌లైవా త‌న అభిమానుల‌తో మూడు రోజుల పాటు మంత‌నాలు జ‌రిపారు. ఈ మంత‌నాల్లో ర‌జ‌నీ పాలిటిక‌ల్ ఎంట్రీపై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.
క్రిటిక్స్ అంచాన ప్ర‌కారం త‌న‌కున్న స్టామీనాతో 2019లోగా పార్టీని స్థాపించి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌వ‌చ్చు అనే ధీమా వ్య‌క్తం చేస్తున్న‌ట్లు వినికిడి. ఇదిలా ఉంటే రజ‌నీని త‌న‌వైపు తిప్పుకునేందుకు పీఎం మోడీ స్థాయిలో లాబీయింగ్ లు న‌డిచిన‌ట్లు స‌మాచారం. అందుకు ర‌జ‌నీ ఒప్పుకోక‌పోవ‌డంతో కేంద్ర మంత్రి సుబ్ర‌హ్మణ్య స్వామి అవాకులు చ‌వాకులు పేల్చారు.
దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు’ అని రజనీ అన్న మాట‌ ఒక పొలిటికల్ జోక్‌గా ఉంద‌ని సుబ్రమణ్య స్వామి అన్నారు. ర‌జ‌నీకాంత్‌ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని, ఆయ‌న‌కు స్పష్టమైన సిద్ధాంతం లేదని విమ‌ర్శించారు. ఏది ఏమైనా ర‌జ‌నీ ఆలోచించి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయాల‌ని అభిమానులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here