మీరు ఇండియాను వ‌దిలి వెళ్లండి..

భార‌తదేశంలో ఉండే ప్ర‌త్యేక హ‌క్కులు అధికారాలు ఉంటాయి. భార‌త చ‌ట్టాలు న‌చ్చ‌ని వారు ఇండియాలో ఉండ‌టానికి వీలు ఉండ‌ద‌ని చెప్పొచ్చు. ఇప్పుడు జ‌మ్ముక‌శ్మీర్లో ఇదే జ‌రుగుతోంది. నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్సు డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మెహబూబా ముఫ్తీలు దేశంలో ఉండ‌టానికి వీలు లేద‌ని అంటున్నారు.

చాలా రోజుల త‌ర్వాత బ‌య‌టికొచ్చి మాట్లాడిన పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ మోహ‌బూబా ముఫ్తీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జమ్మూ కాశ్మీర్ జెండాను ఎగురవేయడానికి అనుమతించకపోతే ఆమె పార్టీ భారత త్రివర్ణ పతకాన్ని ఎగురవేయదు అని అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతూనే ఉంది. జాతీయ జెండాను గౌర‌వించ‌ని వారు దేశంలో ఉండ‌టానికి వీలు లేద‌ని నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన ఏడాది అయిన విష‌యం తెలిసిందే. అయితే అంత‌కుముందు జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక జెండా, ప్ర‌త్యేక రాజ్యాంగం ఉండేవి. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో ఇవి పూర్తిగా కోల్పోయారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్సు డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మెహబూబా ముఫ్తీల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రద్దు చేసిన 370 సెక్షన్ ను పునరుద్ధరించాలని ఫరూక్ అబ్దుల్లా, మెహబూబాలు డిమాండ్ చేయడంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు భారతదేశంలో ఉండటానికి హక్కు లేదని జోషి వ్యాఖ్యానించారు. చైనా దేశం మనపై దాడి చేస్తున్న సమయంలో ఆ దేశ సహాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం ఏమిటని, దీనిద్వారా అంతర్జాతీయ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేంద్రమంత్రి ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here