ఆయన హిందూ ముస్లింల ముఖ్యమంత్రి : సమాజ్ వాది పార్టీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సమాజ్ వాది పార్టీ డిమాండ్ చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అసలు వివాదం ఎందుకంటే ముఖ్యమంత్రి గా తనకు ఏ విశ్వాసం, కులం, మతంతో నాకు సంబంధం లేదన్నారు. హిందువుగా అయితే మసీదు ప్రారంభానికి తాను వెళ్లబోనని యోగి అన్నారు. హిందువుగా తన ప్రార్థనా పద్ధతులు అనుసరించడం తన కర్త్యవ్యం అన్నారు.

ఇప్పుడు ఇదే వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ మండిపడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రమాణానికి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్రంలోని హిందువులు ముస్లింలు అందరికి ఆయనే ముఖ్యమంత్రి అని.. ఆయన ఇలా మాట్లాడటం గౌరవంగా అనిపించుకోదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here