బీజేపీలో క‌ల‌వ‌డంపై వైసీపీ ఒట్టి ప్ర‌చారాలు చేస్తోంది.. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైసీపీ పై అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే. ఈయ‌న వైసీపీ నుంచి గెలిచినా ఆ త‌ర్వాత ఆయ‌న సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు చేస్తూ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను బీజేపీ ఎన్డీయేలోకి ఆహ్వానిస్తుంద‌న్న ప్ర‌చారం ఆయ‌న స్పందించారు. అయితే కేబినెట్లోనికి రావాలంటే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని వైసీపీ ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు చెప్ప‌డం ఏంట‌న్నారు. ఈ మాట‌లు విని న‌మ్మే ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు లేర‌ని ఆయ‌న అన్నారు. ఇక ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలంద‌రితో జ‌గ‌న్ రాజీనామా చేయించాల‌న్నారు. అలా రాజీనామా చేస్తే తాను కూడా త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలన్నారు.

ఇక బీజేపీలోకి తాను వెళ‌తాన‌ని అప్ప‌ట్లో కొంద‌రు చెప్పార‌ని.. ఇప్పుడు ఎవ‌రు ఎవ‌రికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు ఏ రేంజ్‌లో చేస్తున్నారో తెలుస్తోంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం వైసీపీని బ్ర‌తిమాలిన‌ట్లు ప్ర‌చారాలు చేసుకుంటున్నార‌న్నారు. వైసీపీ ఎంపీలు ఇప్ప‌టికే తాము మంత్రులు అయ్యామ‌ని చెప్పుకుంటున్నార‌ని వ్యంగ్యంగా స్పందించారు. న‌వంబ‌రు నెల‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు వ‌ర‌కూ వీళ్లు ఇలాగే ప్ర‌చారం చేస్తార‌న్నారు. ఇక ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌పై జగన్ సర్కార్‌పై మండిప‌డ్డారు. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకుంటే… తనలా వృద్ధిలోకి రావొచ్చని జగన్‌ అనుకుంటున్నారేమో అన్నారు. గుజరాతీ మీడియంలో చదివిన మోదీ… ప్రపంచ నాయకుడు అయ్యారన్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here