‘బుట్ట బొమ్మ’ జోరు అస్సలు తగ్గట్లేదుగా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠ పురంలో’ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కరోనా  మహమ్మారికి ముందు భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇదేనని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ఇందులోని పాటలు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా విజయానికి ప్రధాన కారణమైన ఈ చిత్రంలోని పాటలు.. సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాశాయి. మరీ ముఖ్యంగా బుట్ట బొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు భాష తెలియని వారు కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా బుట్ట బొమ్మ పాట మరో రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఈ పాట 400 మిలియన్ల వ్యూస్ మార్క్ ను దాటేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రయూనిట్ దీనికి సంబంధించి ఓ పోస్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here