వైయస్సార్ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్

దివంగత ఉమ్మడి రాష్ట్రం యం మంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రలు యాత్ర అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్రలో మల్లూవుడ్ సూపర్ స్టార్ మమ్ముటి నటిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు.
ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్ లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్ లో ‘కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది.. ‘ అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభం కానుంది. సినిమాను వచ్చే ఎన్నికల నాటికి విడుదల చేయాలనుకుంటున్నారు..నిర్మాతలు  విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here