రామ్ చరణ్ రంగస్థలం పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

తాజాగా విడుదలైన రంగస్థలం సినిమాటాలీవుడ్ ఇండస్ట్రీలో భీభత్సమైన వసూళ్లు సాధిస్తోంది. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీలో అనేకమంది ప్రశంసలను అందుకుంది. చిట్టిబాబు గా రామ్ చరణ్ సినిమాలో అద్భుతంగా నటించాడు. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యగా ఆది పినిశెట్టి నటన కూడా అద్భుతం.
అయితే ఈ సినిమాపై తాజాగా మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి తన సత్తా చాటిందని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్, సమంతలకు ఇది కచ్చితంగా కెరీర్ బెస్ట్ పర్మామెన్స్ అని అన్నాడు. సినిమా అద్భుతంగా ఉందని… మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు సుకుమార్ ను ‘ట్రూలీ ఏ మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్’ అంటూ కొనియాడాడు.
ప్రతి విషయంలోనూ నీవు ఒక ‘రాక్ స్టార్’ అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను ప్రశంసించాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా ఇదే కలెక్షన్ల వర్షం తో చివరిదాకా రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించాలని కోరుకున్నాడు మహేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here