కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌పాన్‌, జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం వ‌చ్చేసింది..

జ‌మ్ముక‌శ్మీర్‌లో భూకంపం వచ్చింది. ఈ తెల్ల‌వారుజామున వచ్చిన భూకంపం రెక్ట‌ర్ స్కేలుపై 4.1గా న‌మోదైంది. కాగా జ‌పాన్‌లో కూడా ఈరోజు భూకంపం సంభ‌వించింది. జపాన్‌లో ఇండియాలో ఒకేరోజు భూకంపం రావ‌డంపై ప‌బ్లిక్ ఆలోచిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్ గాం సమీపంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. 4.29 గంటలకు భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదైంది. గతంలోనూ జమ్మూకశ్మీరులో పలుసార్లు భూకంపం సంభవించింది.ఈ భూకంపం వల్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో కట్రాకు 88 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

కాగా జపాన్ దేశంలోని చిచిజిమా సమీపంలోని దీవిలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని నగరమైన టోక్యోకు 600 మైళ్ల దూరంలో ఉన్న ఒగాసవరా ద్వీపసమూహంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోైదందని జపాన్ వాతావరణ శాఖ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టం వివరాలు కూడా తెలియలేదు.జపాన్ దేశం భూకంప క్రియాశీల జోన్ లో ఉంది. దీంతో ఇక్కడ తరచూ శక్తివంతమైన భూకంపాలు వస్తుంటాయి. ఇండియా, జపాన్‌లో ఒకే రోజు భూకంపం రావ‌డం ఏంట‌ని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ రెండింటికి ఒకే సారి భూకంపం రావ‌డం సంబంధం లేద‌ని ప‌లువురు కొట్టి పారేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here