బీచ్‌లో న‌గ్నంగా ప‌రుగెడితే ఏమ‌వుతుందో తెలుసా..

బ‌ర్త్‌డేలు వ‌స్తే చాలు ఏదైనా కొత్తగా చేయాల‌నుకోవ‌డం ఇటీవ‌ల బాగా ఎక్కువైంది. అయితే అదేదో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు అయితే పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌దు. అలా కాకుండా డిఫ‌రెంట్‌గా ప్ర‌ముఖ న‌టుడు మిలింద్ సోమ‌న్ చేశాడు. 55 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా తాను చాలా ఫిట్‌గా ఉన్నాన‌ని చెప్ప‌డానికి దుస్తులు లేకుండా బీచ్‌లో ర‌న్నింగ్ చేశాడు. ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యాడు.

బ‌ట్ట‌లు ఏమీ లేకుండా బీచ్‌లో రన్నింగ్ చేసిన మిలింద్ చిత్రాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు. కాగా ఆయ‌న ఫోటోలు తీసింది ఆయ‌న భార్య‌నే. ఈ ఫోటోల‌పై ప‌లువురు బ‌ట్ట‌లు ఇస్తాం వేసుకోండి అంటూ మీమ్స్ కూడా పెట్టారు. ఈ నెల 4వ తేదీన పుట్టిన రోజు సందర్బంగా గోవాలోని ఒక బీచ్‌లో నగ్నంగా పరిగెట్టిన ఫోటో వైరల్‌ కావడంతో మిలింద్‌ఫై శుక్రవారం కేసు నమోదైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గో సూరక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు. అనంత‌రం మిలింద్‌కు బెయిల్ కూడా వ‌చ్చింది. ఈయ‌న‌కు బెయిల్ ఇచ్చే స‌మ‌యంలో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ వీడియోలు, చిత్రాలు, ప్రొఫెష‌న‌ల్ షూట్ వంటివి వ్య‌క్తుల వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు అని అభిప్రాయం చెప్పారు. అయితే ఇలాంటి విష‌యాల్లో అభ్యంత‌రాలు వ్యక్తం అయితే త‌ప్ప‌ అశ్లీలం, అనైతికంగా చెప్ప‌లేమ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here