డేరా బాబా పెరోల్‌పై బ‌య‌ట‌కు వచ్చి ఏం చేశారు..

డేరా బాబా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాగా అత్యాచారం, హ‌త్య కేసులో ఆయ‌నకు జీవిత‌ఖైదు ప‌డింది. దీంతో ఆయ‌న జైలులోనే ఉంటున్నారు. కానీ ఇటీవ‌ల ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌నకు పెరోల్ మంజూరైనట్లు స‌మాచారం ఉంది.

డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్‌రహీంకు ఇటీవల ఒకరోజు పెరోల్ లభించింది. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్ట‌ర్ నేతృత్వలోని బీజేపీ-జేజేపీ కూటమి ప్రభుత్వం అక్టోబరు 24న రామ్‌రహీంకు పెరోల్‌ మంజూరు చేసింది. అత్యాచారం, హత్య కేసులో డేరాబాబా దోషి అని తేలిన తరువాత నుంచి జైలులోనే ఉంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు రామ్‌రహీంకు ఒకరోజు పెరోల్ మంజూరైంది. రామ్‌రహీం తల్లి గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

డేరాబాబా ఆమెను పరామర్శించేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆసుపత్రికి వెళ్లారు. అక్టోబరు 24న సాయంత్రం వరకూ డేరాబాబా ఆసుపత్రిలో తన తల్లి దగ్గరే ఉన్నారు. డేరా చీఫ్‌ను జైలు నుంచి పోలీసు జీవులో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమయంలో పోలీసు జీపునకు పరదా వేశారు. కాగా డేరాబాబాకు పెరోల్ మంజూరు చేయడంలో బీజేపీ టాప్ లీడర్ హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా డేరా బాబాకు పెరోల్ ఇవ్వడం వలన భవిష్యత్‌లో అతను అధికారులను ఆశ్రయించి, జైలు నుంచి విడుదలయ్యేందుకు కూడా ప్రయత్నించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here