ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై ఫుల్ క్లారిటీ రానుందా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల న‌గారా మోగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇత‌ర రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతుంటే ఏపీలో స్థానిక సంస్థల హ‌డావిడి రాబోతోందా అనిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు దీన్నే సూచిస్తున్నాయి.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన అనంత‌రం క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా పడ్డాయి. ఆ త‌ర్వాత క‌రోనా కేసులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు అన్‌లాక్ న‌డుస్తోంది. ఇతర రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మీష‌న్ సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రకటించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీల నిర్ణయం కోసం ఎస్ఈసీ మీటింగ్ ఏర్పాటు చేస్తోంది. ఇక ఇప్ప‌టికే ఎస్ఈసీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు నిధులు విడుద‌ల చేసేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం నుంచి ఏ విద‌మైన స‌హ‌కారం కావాలో తెలుపుతూ అద‌న‌పు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టును ఎస్ఈసీని ఆదేశించింది. ఈ మేర‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ దాఖ‌లు చేసిన అన‌బంధ పిటిష‌న్‌పై వాద‌న‌లు ముగిశాయి. హైకోర్టు నిర్ణ‌యాన్ని వాయిదా వేసింది.

ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నందున ఏపీలో జ‌రిగే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here