నక్క తోక తొక్కిన రకుల్ ..మెగా హీరోతో పీకల్లోతు ప్రేమ..

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలలో టాప్ హీరోయిన్ గా అన్ని ఇండస్ట్రీల్లో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటివరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో  వరుసగా హిట్లు కొట్టిన ఈ అమ్మడు  ప్రస్తుతం బాలీవుడ్లో తనను తాను ప్రూవ్ చేసుకోడానికి సిద్ధమవుతుంది. అయితే రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఫిలిమ్ నగర్లో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది.అదేంటంటే మెగా కాంపౌండ్ కి సంబంధించిన ఒక యంగ్ హీరోతో పీకల్లోతు డేటింగ్ లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో గుస గుస లాడుకుంటున్నారు .

అయితే ఇప్పటి నుండి కాదు ఏకంగా దాదాపు రెండు యేండ్ల నుండి అంట .గతంలో విడుదలైన మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ మూవీలో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. అయితే అప్పట్లో విన్నర్ సినిమా జరుగుతున్న సమయంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ సాయి ధరం తేజ్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న వార్తలు వచ్చినయి. అయితే ప్రస్తుతం మళ్లీ వార్తలు రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here