అజ్ఞాతవాసి ఇండస్ట్రీ కి నేర్పిన పాఠాలు

ఈ సంక్రాంతి కి విడుదలైన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి చాలా పాఠాలు నేర్పుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో డిస్టిబ్యూటర్లు బాహుబలి తొలి భాగానికి మించి రేట్లు ఇచ్చి మరీ కొన్నారంటే అజ్ఞాతవాసి సినిమా పై అందరి అంచనాలు ఏ మాత్రం పెతుకున్నారో అర్దమైంది. అయితే వీరిద్దరిపై పెట్టుకుని నమ్మకమే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు నిండా ముంచేసింది. గతంలో విడుదలై డిజాస్టర్ అయిన రెండు పవన్ కళ్యాణ్  సినిమాలు కంటే అజ్ఞాతవాసి సినిమా అమౌంట్ పరంగా  లాస్ ఎక్కువ కావడంతోనే చర్చంతా ఆ సినిమా చుట్టూ తిరుగుతోంది.

అందుకే ఇప్పుడు డిస్టిబ్యూటర్లు ఎవరి మీద నమ్మకం పెట్టుకుని సినిమా కొనుగోలు చేయకూడదని  బుద్ధి తెచ్చుకున్నారట.గతంలో డిస్టిబ్యూటర్లు సినిమా ఫస్టాఫ్ చూసి కొనుగోలు చేయాల? వొద్దా? అనే చాయిస్ ఉండేది. అయితే ఇప్పుడు కేవలం నమ్మకం మీదే సినిమాలు కొనుగోలు జరగడం జరుగుతుంది.ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా దెబ్బతిన్నది ఈ నమ్మకమే అని చెప్పవచ్చు.ఈ క్రమంలో  విడుదలకు సిద్దంగా ఉన్న రామ్ చరణ్ మూవీ రంగస్థలం, మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను, అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య చిత్రాలకు ఓవర్సీస్ లోనే కాదు లోకల్ గా కూడా ఆశించిన స్ధాయిలో రేట్లు దక్కకపోవచ్చని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here