బెయిల్ దక్కించుకున్న అమలాపాల్

తెలుగింటి అమ్మాయి ల ఉండే అమలాపాల్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళాల్లో చాలా నెమ్మదిగా కనిపించేది సో అప్పుడు చాలామంది అమలాపాల్ తిరుని చూసి చాలా నెమ్మది గల పిల్ల అని అనుకున్నారు అందరు. కానీ తీరా ఈ ముద్దుగుమ్మ వ్యవహారం బయట చూస్తే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముందుగా ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది అమలాపాల్. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకుని సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఐ యం  బ్యాక్ అంటూ సినిమాలలో నడుము చూపిస్తూ  అందాల ఆరబోత లో డోస్ పెంచింది. అంతేకాకుండా మొన్నామధ్య  సోషల్ మీడియాలో సిగరెట్ తాగుతూ  రచ్చ రచ్చ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గతంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే.

2017లో రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేసిన అమలాపాల్ తప్పుడు చిరునామాను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించుకుందని తద్వారా రూ. 20 లక్షల టాక్స్ ను ఎగ్గొట్టిందని కేరళలో పోలీస్ కేసు నమోదైంది. అయితే ఈ క్రమంలో అమలాపాల్ ముందుగానే బెయిల్ తెచ్చుకుని సేఫ్ అయ్యింది.కోర్టు ఆదేశాల మేరకు  పోలీసులు విచారణకు  సహకరించాలని  కోర్టు మందలించింది. బెయిల్  కొరకు న్యాయస్థానంలో లక్ష రూపాయల పుచికత్తు సమర్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here