చంద్రబాబు కంటే పవన్‌ గొప్పోడా..?

ప్రపంచ దేశాల లో అతి పెద్ద ప్రజాస్వామ్య  దేశం  భారతదేశం, భావప్రకటన స్వేచ్ఛ కలిగిన దేశం ఎవరి నిర్ణయాన్ని వారు నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి దేశంలో పుట్టిన పవన్ కళ్యాణ్  తాను భారతీయుడినని గర్వంగా పలు ఆడియో ఫంక్షన్లలో, రాజకీయ సభలో చెప్పుకుంటాడు.అంతేకాకుండా  తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ  నా అభిమానులు చాలా చాలా మంచోళ్లు ,ఎవరికీ ఇబ్బంది కలిగించారు అని పవన్ చెబుతుంటారు.

నాకు మతం లేదు, కులం లేదు, సామాన్యులకి అండగా నిలబడి వారికి ఏమైనా కష్టం కలిగిస్తే మాత్రం తప్పకుండా ప్రశ్నిస్తా  అని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ సామాన్యుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు  కత్తి మహేష్ పై జరుగుతున్న ప్రజాస్వామిక దాడి విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ క్రమంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తన వల్ల సామాన్యుడికి అసౌకర్యం కలిగినప్పుడు చంద్రబాబు స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పినప్పుడు బాబుకు లేని అడ్డు పవన్ కి వచ్చిందా? చంద్రబాబు కంటే పవన్‌ గొప్పోడా..? మోడీ, చంద్రబాబు, జగన్ ఇలా ఎవరు విమర్శలకు అతీతులు కాదు.

ఇది భారతదేశం నాకిచ్చిన ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయమని కాబట్టి దీనిపై తగ్గేది లేదని కత్తి మహేష్ స్పష్టం చేశాడు. చంద్రబాబు జగన్ మోడీ ల గురించి మాట్లాడవచ్చు గాని నేను పవన్ గురించి మాట్లాడితే  ఆయన అభిమానులు ఇలా దాడి చేస్తారా? ఇది నా ఒక్కడి సమస్య కాదు  అందరిదీ ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కత్తి మహేష్ స్పష్టం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here