ఈ ఇద్దరు యంగ్‌ హీరోలు మల్టీ స్టారర్‌కు సై అంటారా..?

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తేజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే మంచు మనోజ్‌ సాయి ధరమ్‌ తేజ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఓ ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌ బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’ అనే చిత్రం నేటికి (అక్టోబర్ 15) 38 ఏళ్లు పూర్తిచేసుకుంది. దీంతో ఈ సినిమా పోస్టర్‌ను పోస్ట్‌ చేసిన మనోజ్‌.. సాయి ధరమ్‌ తేజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌ డే బాబాయ్‌.. నీ పుట్టిన రోజునే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘బిల్లా రంగా’ విడుదలై 38 ఏళ్లు గడుస్తోంది. నాకు.. మనకు ఇదోదే చెబుతున్నట్లు అనిపిస్తోంది బాబాయ్‌. నేను రడీ.. నువ్వు రడీనా?’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ఈ లెక్కన మనోజ్‌ ‘బిల్లా రంగా’ చిత్రం రీమేక్‌ చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది కేవలం సరదాకేనా నిజంగా ఈ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశాలేమైనా ఉన్నాయా.? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here