ఊళ్లో ఉండొద్దు.. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు కూర్చొవద్దు.!

డేరింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో ఓ చిన్న సైజ్‌ మోటివేషన్‌ స్పీకర్‌గా మారిపోయాడు. సమాజంలోని కొన్ని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. తన అభిప్రాయాలను చెబుతున్నాడు. ఈసారి మనుషుల నమ్మకాలు, జీవితం కోసం చేసే వేట గురించి చెప్పుకొచ్చాడు.

పూరి చెప్పిన ఆ లాజిక్‌ పాయింట్స్‌ ఆయన మాటల్లోనే.. ‘మంగళవారం మంచిది కాదు అని ఓ కుక్కని కన్విన్స్ చెయ్యలేం. శ్రావణ శుక్రవారం స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చచెప్పలేం. ప్రపంచంలో ఏ జంతువూ కల్పిత కథలను నమ్మదు. జంతువులు వాస్తవాలనే నమ్ముతాయి. కానీ, బూడిద పూస్తే దెయ్యం రాదు అంటే మనం నమ్ముతాం. ఈ రాయిని లోపల పెట్టుకుంటే ప్రపంచాన్ని ఏలతావు అంటే నమ్ముతాం. మనిషి వేటగాడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభించాడు. వేట మానేశాడు. ఇంటి చుట్టూ పంట. చేతిలో కంచం. పని తగ్గింది. కల్పిత కథలు మొదలయ్యాయి. వాటిని వినడమే కాదు నమ్మడం కూడా మొదలెట్టాడు. అప్పుడే అన్ని దరిద్రాలూ చుట్టుకున్నాయి. తర్వాత దేవుడు పుట్టాడు. మతం పుట్టింది. నమ్మకాలు మొదలయ్యాయి. వాటి మధ్య పెరిగాం. ప్రశ్నించే ధైర్యం లేదు. నలుగురితో నారాయణ.. గుంపుతో గోవింద.

కంచంలోకి ఉచితంగా భోజనం వచ్చినన్ని రోజులూ ఇలాగే ఉంటుంది. వేటగాడెప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మీరు వేట మానొద్దు. మీ ఊళ్లో ఉండొద్దు. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు కూర్చోవద్దని’ చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్‌. మరి మనుషుల నమ్మకాలు, అభిప్రాయాలపై ఇలాంటి కామెంట్లు చేసిన పూరి ఎలాంటి కామెంట్లు ఎదుర్కుంటాడో చూడాలి.

View this post on Instagram

‪👉 https://youtu.be/cjS3O2cxa64 @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here