నరసింహ నాయుడు సీక్వెల్ ?

నరసింహనాయుడు సినిమా బాలకృష్ణ సినీ జీవితంలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది  బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీపగలగొట్టి కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం…. ఈ  సినిమా కథను అందించిన చిన్ని కృష్ణ సీక్వెల్ కథను బాలకృష్ణ కు చెప్పాడంట.

ఈ సినిమా కథ నచ్చడంతో  చెప్పగానే బాలకృష్ణ చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడనుందని అంటున్నారు..వరుసగా సినిమాలు చేస్తున్నా బాలకృష్ణ… ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడు చూడాలి మరి. ప్రస్తుతం ఎస్వీ కృష్ణా రెడ్డి తో ఒక సినిమాకి బాలయ్య సంతకం పెట్టారు అనీ ఆ సినిమా సై ఫై డ్రామా అనీ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here