సీఎం సీఎం పవన్ కళ్యాణ్ అని అరిస్తే మీకు ఆనందం .. నాకు కాదు – పవన్ కళ్యాణ్

నేను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు ప్రశ్నించడం కోసం వచ్చాను అంటున్న పవన్ కళ్యాణ్ …విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) సిబ్బంది చేస్తున్నా సమ్మెకు మద్దతు తెలుపుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాభాల్లో కొనసాగుతున్న డీసీఐని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఈ సమస్య పై ప్రధాని మోడీ కి లేఖ రాస్తాను అని అన్నారు.
ఇటువంటి సమస్యల పై రాజకీయ నాయకులు స్పందించకపోవడం దూరదృష్టకరమని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరకు ఓట్లు అడగటానికి వచ్చే నాయకులు …ఆ సందర్బాలలో ప్రజలే దేవులు అంటూ తెగ ఫోసులు కొడతారు… ఇటువంటి నాయకులూ   వచ్చే ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదని ఈ సందర్బంగా స్పష్టం చేసారు. నా సినిమా కు ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కునే ధైర్యం నాకుంది నేను ఎవరు మీదా ఆధారపడను అంటూ పరోక్షంగా  సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గూర్చి చెప్పారు.
2014 ఎన్నికల వేళ లో నాకు స్నేహితులు బంధువులు లేరని ఆనాడు చెప్పాను.. ఎవరైనా ఉంటే ప్రజలే బంధువులు స్నేహితులు. డీసీఐ సమస్యలను బిజెపి  ప్రజా ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని హెచ్చరించారు. గత ఎన్నికలలో గెలిచే శక్తి ఉన్ననిలబడలేదని పోటీ చేయలేదని ఇతర పార్టీలకు ప్రచారం చేస్తాను అని అన్నారు.ఈలోగా అభిమానులు సీఎం సీఎం అంటూ అరవడంతో పవన్ కళ్యాణ్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ” సీఎం సీఎం అంటే మీకు ఆనందంగా ఉంటుందేమో..నాకు కాదు. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.
నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు రకపోతే ప్రజలకు సేవ చెయ్యడం మానేస్తామా?సమస్యలపై పోరాడటం మానేస్తామా? పదవులే రాజకీయాల పరమావధి కాదు. కీడెంచి మేలెంచండి…నినాదాలు చేయడం వల్ల నాకు ఆనందం కలుగదు” అంటూ ఆయన అభిమానులకు హితవు పలికారు. అనంతరం మాట్లాడుతూ ఎవరో చేసిన తప్పుకి శిక్ష మరోకథ అనుభవిస్తున్నారు . ప్రజలు రాజకీయ నాయకులను నిలదీసిన రోజున ఏ రాజకీయనాయకుడు తప్పించుకోలేరని ఆయన అన్నారు.. ఈ వ్యాఖ్యలు నాకు కూడా వర్తిస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు డీసీఐని ప్రైవేటు పరం చేస్తే బీజేపీ పతనం వైజాగ్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here