విజయ్‌ని ఎందుకు ఇంతలా టార్గెట్‌ చేస్తున్నారు.?

శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ జీవిత కథ ఆధారంగా ‘800’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుందని ప్రకటించిన నాటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. తన బయోపిక్‌ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోమని విజయ్‌ సేతుపతికి.. మురళీ ధరన్‌ చేసిన విజ్ఞప్తి మేరకు విజయ్‌ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక అంతకు ముందు విజయ్‌ను కూడా ఈ సినిమా నుంచి తప్పుకోమని నెటిజన్లు ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే సినిమా నుంచి తప్పుకున్నానని ప్రకటించిన తర్వాత కూడా విజయ్‌పై ట్రోల్‌ జరుగుతూనే ఉంది. తాజాగా కొందరు నెటిజెన్లు మరింత తెగించి విజయ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ చిన్న కూమార్తెపై అత్యాచార బెదిరింపులకు దిగుతున్నారు. సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్‌ చేసిన ట్వీట్‌కు కొంతమంది ఆకతాయిలు కామెంట్‌ చేస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవ్వడంతో సదరు నెటిజన్‌ ప్రవర్తనను ఖండిస్తున్నారు. సినిమా నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన తర్వాత కూడా విజయ్‌పై ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేస్తుండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్‌ని ఎవరో కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here