మహేష్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..

సినిమా.. సినిమాకు గ్యాప్‌ ఎక్కువ తీసుకునే హీరోల్లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఒకరు. మహేష్‌ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు ఆయన అభిమానులు. తమ అభిమాన హీరోని ఏడాదిలో రెండు సార్లు వెండి తెరపై చూడాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. అయితే భారీ బడ్జెట్‌ చిత్రాలు, ఎక్కువ రోజులు డేట్స్‌ కారణంగా మహేష్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు పెద్దగా సాధ్యం కావు. అంతేకాదు మహేష్‌ దాదాపు ఎప్పుడూ ఒకేసారి రెండు చిత్రాల్లో నటించలేదు.

అయితే వచ్చే ఏడాది మహేష్‌ రెండు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి మహేష్‌ సర్కారు వారి పాట సెట్స్‌ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడని సమాచారం. 2021లో సర్కారు వారి చిత్రం చేస్తూనే.. త్రివిక్రమ్‌ మూవీని కూడా చేయనున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే కనీసం ఆరు నెలల గ్యాప్‌లోనే మహేష్ రెండుసార్లు అభిమానులను ఆకట్టుకోనున్నాడన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here