హెల్మెట్ పెట్టుకోక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోతున్నారా..

ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాల్సిన ప్ర‌భుత్వాలు ఆ దిశ‌గానే చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయ‌ని నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ద్విచ‌క్ర వాహ‌న‌దారులు క‌చ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేన‌ని కఠిన నిబంధ‌న‌లు పెడుతున్నారు.

హెల్మెట్ వాడ‌కంపై ముందు నుంచీ క‌ర్నాట‌క ప్ర‌భుత్వం క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే చాలా మంది ప‌బ్లిక్ కూడా దీనిపై పూర్తి అవ‌గాహ‌న‌తోనే ఉన్నారు. బ‌య‌ట‌కు వ‌స్తున్నారంటే క‌చ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటారు. అయితే కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కార‌ణంగా ప్ర‌భుత్వం మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ చ‌ర్య‌లు లైసెన్స్ ర‌ద్దు చేసే వ‌ర‌కు దారితీస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

హెల్మెట్ పెట్టుకోని ద్విచక్రవాహనాదారుల లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ అవుతుందంటూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ వాహన చట్టం కింద ఈ నిబంధన విధించింది. అంతేకాకుండా.. ఈ ఉత్తర్వులు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు కూడా సూచించింది.
టూ వీలర్స్‌పై ప్రయాణించే వారందరూ కచ్చితంగా హెల్మెంట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రవాణామంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హెల్మెట్ లేకుండా పోలిసులకు చిక్కేవారందరూ 3 నెలల పాటు వారి లైసెన్స్ కోల్పోవాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here