రాధేశ్యామ్‌ నుంచి మరో అప్డేట్‌..!

జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘రాధేశ్యామ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చారిత్రక ప్రేమికుల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్ర యూనిట్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్లుగానే సినిమా టెక్నిషియన్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించిన చిత్ర యూనిట్‌ సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు.

ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని కూడా బాగా పాపులర్‌ అయిన వారిని తీసుకుంటారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా చిత్రయూనిట్‌ ఒక యువ సంగీత దర్శకుడిని రాధే శ్యామ్‌కోసం ఓకే చేసింది. తమిళ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ సంగీత దర్శకుడు జస్టిస్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించనున్నట్లు ప్రకటించారు. ఈయన ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇదిలా ఉంటే, ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజును పురష్కరించుకుని ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి తొలి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ అని టైటిల్ పెట్టారు. ఈ మోషన్ పోస్టర్ కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here