విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలిసింది..

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలంటేనే మంచి టాక్ ఉంటుంది. అలాటింది ఇక ద‌మ్మున్న హీరోల‌తో ఆయ‌న సినిమా చేస్తే ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్‌.. యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

విజ‌య్ పూరి క‌లిసి ఓ పాన్ ఇండియా సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకు ఫైట‌ర్ అని పేరు కూడా పెట్టేశారు. బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ కంటే ముందే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిపోయింది. అన్‌లాక్ తర్వాత మిగిలిన సినిమా షూటింగ్‌లన్నీ ప్రారంభమైనప్పటికీ `ఫైటర్` మాత్రం మొదలుకాలేదు. డిసెంబర్ మొదటి వారంలో `ఫైటర్` షూటింగ్ మొదలవుతుందని వార్తలు వచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం జనవరి రెండు లేదా మూడో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం విదేశీ ఫైటర్స్ అవసరమవుతారట. కరోనా కారణంగా వారు ఇప్పుడు భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. అందుకే జనవరిలో షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఇటు పూరి ఫ్యాన్స్‌.. అటు విజ‌య అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here