మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అభిమానుల‌కు పండుగ రోజు అని చెప్పొచ్చు. క‌రోనా లాక్‌డౌన్ వ‌చ్చింది కానీ లేదంటే మెగాస్టార్ మూవీ షూటింగ్స్లో బిజీ అయిపోయేవారు. అయితే లాక్‌డౌన్ త‌ర్వాత ఆచార్య సినిమాతో చిరు మూవ్ అవుతున్నారు. మ‌ధ్య‌లో కొంత గ్యాప్ వ‌చ్చినా ఇప్పుడు కంటిన్యూగా షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న `ఆచార్య`లో నటిస్తున్నారు. దీని తర్వాత `లూసిఫర్` రీమేక్‌ను పట్టాలెక్కిస్తారు. ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేసే బాధ్యతను తమిళ దర్శకుడు మెహన్ రాజాకు అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. కొందరు రచయితలతో కలిసి మోహన్ రాజా ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేస్తున్నారట. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ పవర్‌ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్టు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు `బైరెడ్డి` అనే టైటిల్ ఫిక్స్ చేశారట. మరి, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. బైరెడ్డి అంటే రాయ‌ల‌సీమ‌లో ఓ నేత పేరు. మ‌రి ఈ టైటిల్ నిజంగానే అనుకున్నారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here