మ‌హేష్‌బాబు కొత్త లుక్‌.. ఫ్యాన్స్‌కు పండుగే..

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల్లో రాణిస్తూ వ‌స్తున్నారు. అయితే మ‌హేష్ చిన్న‌ప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నారో ఇప్ప‌టికీ అదే క్యూట్‌నెస్ ఆయ‌న మెయింటెయిన్ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న ఓ ఫోటో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

కొంత మంది విషయంలో వయసు అనేది కేవలం ఓ నెంబర్ మాత్రమే. వయసు పెరుగుతున్నప్పటికీ వారు మరింత యంగ్‌గా తయారవుతుంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు. 45 ఏళ్ల వయసులో కూడా మహేష్ యువకుడిలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌ తీసిన ఓ ఫొటోను మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఓ యాడ్ చిత్రీకరణ కోసం తీసిన ఈ ఫొటోలో మహేష్ మరింత స్మార్ట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. `అవినాష్ గోవారికర్‌ తీసిన ఫొటోల్లో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. కానీ, ఇది నాకు మరింత బాగా నచ్చింద`ని మహేష్ పేర్కొన్నాడు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించనున్న `సర్కారు వారి పాట` సినిమాను మహేష్ త్వరలో పట్టాలెక్కించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here