వరుణ్ తేజ్ – ఎందుకంత రిస్క్ చేస్తున్నాడు ?

లోఫర్ , మిస్టర్ లాంటి సినిమాలు ట్రై చేసి నెమ్మదిగా మాస్ కి యూత్ కీ దగ్గర అవుదాం అని ప్లాన్ చేసిన మెగా కుర్రాడు వరుణ్ తేజ్ ఆ టైపు సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసే పనిలో పడ్డాడు. ఇప్పుడు అతను డిఫరెంట్ సినిమాల మీదనే దృష్టి పెడుతున్నాడు. ఫిదా అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న వరుణ్ కొత్తగా వెంకీ అట్లూరి అనే రైటర్ ని డైరెక్టర్ గా డెబ్యూ చేయిస్తూ రిస్క్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హైదరాబాద్‌లో సింపుల్‌గా ముహూర్త కార్యక్రమం నిర్వహించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న వెంకీ డైరెక్టర్ అవ్వాలి అని మూడేళ్ళుగా ప్రయత్నం చేస్తూ ఉండగా ఇప్పటికే సక్సెస్ అయ్యింది. రవితేజ తో సినిమా అనుకున్నా అది వర్క్ అవ్వలేదు  , సాయి ధరం తేజ కోసం రాసిన కథని ఇప్పుడు వరుణ్ తేజ్ తో చేస్తున్నాడు వెంకీ . అనుభవం ఉన్న పూరీ , శ్రీను వైట్ల తోనే ప్లాప్ లు పడ్డాయి ఇక అనుభవం లేని ఇతనితో హిట్ కొడదాం అనుకోవడం వరుణ్ కి రిస్క్ ఏ మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here