హీరో నానీకి తల్లిగా .. పవన్ , మహేష్ , ఎన్టీఆర్ ల హీరోయిన్ :

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ భూమిక ది ఒకప్పుడు మంచి స్థానం. పవన్ కళ్యాణ్ తో ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆమె ఎన్టీఆర్ తో సింహాద్రి , మహేష్ తో ఒక్కడు లాంటి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చేసింది. భూమికా చావ్లా ఆ తరవాత పెద్ద హీరోలు అందరితో రోమాన్స్ చేసి నెమ్మదిగా పెళ్లి చేసుకుని సినిమాల నుంచి సైడ్ అయిపొయింది. మిస్సమ్మ అనసూయ లాంటి చిత్రాలు తీసి అవార్డులు కూడా గెలుచుకున్న భూమిక ఎక్స్ పోజింగ్ విషయం లో దూరంగా నటన విషయం లో దగ్గరగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నానీ కొత్త సినిమా ఎంసీఏ లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

ధోనీ అనే హిందీ సినిమాలో కనపడిన మిస్సమ్మ అందులో ధోనీ పాత్ర చేసిన హీరోకి అక్కగా కనిపించింది. మరి తెలుగులో కూడా నానీకి అక్కగా ? వదినగా కనిపిస్తుందా అంటున్నారు. అన్నీ తీసేసి తల్లి పాత్ర చేసినా ఆశ్చర్యపోవక్కరలేదు అని ఫిలిం నగర్ గుసగుస.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here