డీజే కి గ్రౌండ్ టోటల్ క్లియర్

బాహుబలి చిత్రం వచ్చి యాభై రోజులు దాటిపోయాయి .. ఆ తరవాత వారాల్లో కేశవ , రారండోయ్ , అమీ తుమీ సినిమాలు వచ్చి పర్లేదు అన్నట్టు రన్ అయ్యాయి. భారీ సినిమాలు మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాయి వచ్చే వారం లో రాబోతున్న దువ్వాడ జగన్నాథం సినిమా తప్ప దగ్గరలో పెద్ద చిత్రమే లేదు. తెలుగు ప్రేక్షకులు పెద్ద చిత్రం ఏది వస్తుందా అని ఎదురు చూస్తున్న టైం లో రాబోతున్న దువ్వాడ రాక మంచి ఓపెనింగ్ లని ఇచ్చి తీరుతుంది అని చెప్పాలి. ఈ వారం వచ్చిన కాదలి, మరకతమణి, రాజా చెయ్యి వేస్తే.. వీటిలో వేటికీ మంచి టాక్ లేదు. ఏదీ వీకెండ్ తర్వాత నిలిచే పరిస్థితి లేదు.

సో డీజే కి గ్రౌండ్ పూర్తిగా క్లియర్ గా ఉంది. డీజే వచ్చే వారం ముందర అన్నీ ప్లాప్ సినిమాలు ఆ తరవాత వారం అసలు సినిమాల విడుదల లేదు. సో ఓపెనింగ్ లు మాత్రమె కాక ఫస్ట్ వీకెండ్ కూడా డీజే కుమ్మేయ బోతోంది అన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here