ఆ ఒక్క సినిమా హీరో కెరీర్ ని సమాధి చేసేసింది :

బ్లాక్ బస్టర్ సినిమాలకి నిర్మాతగా పేరున్న ఎం ఎస్ రాజు అప్పట్లో తన కొడుకుని పరిచయం చెయ్యడం కోసం చాలా కసరత్తు చేసారు. సరిగ్గా అతను ఇంట్రడ్యూస్ అయ్యే టైం కి తండ్రి ప్రొడ్యూసర్ గా ప్లాప్స్ లో ఉండడం మనోడికి పెద్ద మైనస్ పాయింట్ గా మిగిలింది. తండ్రి డైరెక్షన్ చేసిన తూనీగా తూనీగా సినిమా డిజాస్టర్ అవ్వడం సుమంత్ అశ్విన్ కి మొదట్లోనే భారీ షాక్ ని అందించింది. ఇప్పుడు అతన్ని హీరోగానే జనం గుర్తించడం లేదు. సినిమా ఛాన్స్ లు లేక వెబ్ సీరీస్ లలో నటిస్తున్నాడు సుమంత్. అసలే సినిమాలు లేవు అనుకున్న టైం లో వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సినిమా ఇక అతని కెరీర్ కి చరమాంకం అనే చెప్పాలి.

లేడీస్ టైలర్ సీక్వెల్ అంటూ వచ్చిన ఈ సినిమా కి పర్లేదు అనిపించే హైప్ ఏర్పడింది. అప్పట్లోని వంశీ – రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ ని గుర్తు తెచ్చుకుని మరీ థియేటర్ లకి వెళ్ళిన జనాలకి షాక్ ఇచ్చాడు పెద్ద వంశీ. మొదటి ఆట షో ల నుంచీ ప్లాప్ టాక్ వచ్చిన ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కెరీర్ ని సమాధి చేసేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here