మాస్ .. ఊర మాస్ అంటే ఏంటో చూపిస్తా .. డైరెక్టర్ సుకుమార్ ఛాలెంజ్

డైరెక్టర్ సుకుమార్ అంటే పూర్తిగా క్లాస్ డైరెక్టర్ అతని సినిమాలలో క్లాస్ టచ్ మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ అబ్బా ఏం మాస్ సినిమా ఇది అనుకునేలా ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా తీయలేదు డైరెక్టర్ సుక్కూ.. కమర్షియల్ టచ్ ఉండే క్లాస్ సినిమాలు తీసే సుకుమార్ మొట్ట మొదటి సారి తన కెరీర్ లో భిన్నంగా ఒక మాస్ సినిమా తీస్తున్నాడు. రామ్ చరణ్ తో వస్తున్న రంగస్థలం లో తన మాస్ స్టైల్ ఏంటి అనేది చూపించడానికి సిద్దం అవుతున్నాడు సుక్కూ. రామ్ చరణ్ ని గడ్డం పెంచి లుంగీ లో చూపిస్తూ తనదైన లుక్ ఇవ్వ బోతున్నాడు సుకుమార్.

ఎన్టీఆర్‌తో తీసిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రశంసలు అందుకున్నా కానీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రం విజయవంతం కాలేకపోయింది. మాస్ నే టార్గెట్ గా పెట్టుకుని సుకుమార్ తీస్తున్న ఈ సినిమాలో మాస్ కి డెఫినిషన్ ఇచ్చేస్తా అంటున్నాడు సుకుమార్. అవుట్ పుట్ కూడా చాలా పాజిటివ్ గా వస్తోందట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here