తమ్మారెడ్డి భరద్వాజ కి రామోజీ అంటే ఎందుకు భయం ?

తెలుగు ఇండస్ట్రీ కి అడగకపోయినా ఒక పెద్ద దిక్కు లాగా ఫీల్ అవుతూ ఉంటారు తమ్మారెడ్డి భరద్వాజ. వివాదాలలో ఉన్నా వివాదాలు పరిష్కరించే వ్యక్తిగా ఆయన ముందు ఉంటారు. దేనిగురించి అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే భరద్వాజ ఎప్పుడూ తన సిద్దంతాలని వదులుకోలేదు అనే పాజిటివ్ న్యూస్ ఆయన మీద ఉంది. ఎప్పుడూ ద్వందార్ధాలు, బూతులు , కించపరిచే కార్యక్రమాలు వచ్చినప్పుడు ఫోన్ చేసి మరీ టీవీ యజమానులకి క్లాస్ పీకే ఆయన ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా రామోజీరావు ని తిడుతున్నారు.

ఈటీవీలో వస్తున్న పలు కార్యక్రమాలు బాగా లేవని, సమరం కార్యక్రమాల కంటే ఘోరంగా ఉన్నాయంటున్నాడు. రామోజీరావు ఒకసారి తన మిత్రునితో రాత్రి 9గంటలకు వచ్చే వార్తల తర్వాత అధికశాతం మంది టీవీలు ఆఫ్‌ చేస్తారని, ఆ సమయం తర్వాత వచ్చే ప్రోగ్రాంలు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఫర్వాలేదనే వాదనను తాను ఖండించినట్లు చెప్పాడు. ఎవ్వరినైనా ఎదిరించగలగాలి కానీ కొందరి విషయం లో నీళ్ళు నమిలితే ఎలా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here