బాలీవుడ్ క్వీన్ తెలుగు, తమిళం లో ఇక లేనట్టే .. అటక ఎక్కేసింది

బాలీవుడ్ లో క్వీన్ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు దాటిపోయింది .. ఈ సూపర్ హిట్ సినిమాని సౌత్ ఇండియా లో ద్విభాషా చిత్రం గా రీమేక్ చేస్తూ తెలుగు , తమిళం లో విడుదల చేస్తాను అంటూ తమిళ నిర్మాత త్యాగరాజన్ హీరోయిన్ ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆ సినిమా అప్పట్లో హిట్ అవ్వగా దాని రీమేక్ హక్కులు తనదగ్గర పెట్ట్టుకుని బోలెడు మంది హీరోయిన్ ల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. మొన్నటి లాగా ఒట్టి తెలుగు తమిళం కాకుండా ఇప్పుడు నాలుగు భాషల్లో సినిమా కంప్లీట్ చేస్తా అంటున్నాడు రాజన్.
ఏ భాషకి ఆ భాష కోసం నటీ నటుల ఎంపిక మీదనే దాదాపు రెండేళ్ళు గడిపేసాడు. తెలుగు తమిళం కోసం తమన్నా నీ మలయాళానికి అమలా పాల్ ను.. కన్నడకు పారుల్ యాదవ్ ను కథానాయికలుగా కన్ఫమ్ చేశాడు. డైరెక్టర్ లని కూడా ఆయా భాషలలో ఓకే చేసి ఇప్పుడు సడన్ గా సినిమా అటక ఎక్కేసింది అంటూ చేతులు ఎత్తేశాడు అనే వార్తలు వినపడ్తున్నాయి. త‌మిళ‌.. తెలుగు వెర్ష‌న్ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సిన రేవ‌తి కూడా ఈ ప్రాజెక్టును వ‌దిలేసింద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here