బయో పిక్స్ తీసే దమ్ము మనోళ్ళకి ఉందా ?

బయో పిక్ అనగానే అది ఖచ్చితంగా వివాదమే అవుతుంది. ఎందుకంటే సాధారణం గా బతికేసిన వ్యక్తుల గురించి బయో పిక్ తీయడం లో కిక్కేముంది ? అందుకే బయో పిక్ అంటేనే వివదాస్పద అంశం. ఇలాంటి బయో పిక్ లు తీయాలి అంటే చాలా తెగువ , విమర్శలు, దాడులకి జంకని మనసత్వం ఉండాలి . ఎలాంటి విమర్శలు వచ్చినా తట్టుకోగాలగాలి. చరిత్రని వక్రీకరణ చెయ్యకుండా సరిగ్గా ఉన్నది ఉన్నట్టి తీయాలి. కానీ రామ్ గోపాల్ వర్మ కి తప్ప అలంటి తెగువ ఉన్న దర్శకులు నడియా లోనే లేరు. సిల్క్ స్మిత బయో పిక్ గా వచ్చిన డర్టీ పిక్చర్ సినిమాలో అ డైరెక్టర్ సిల్క్ స్మిత ని ఒక హీరో వాడుకున్నాడు అని క్లియర్ గా చూపించాడు.

అశ్వినీ దుత్ కూతురు అల్లుడు కలిసి చేస్తున్న సావిత్రో బయో పిక్ కి సంబంధించి బోలెడు అనుమానాలు రేగుతున్నాయి. ఉన్నది ఉన్నట్టుగా చూపించే గట్స్ ఆ డైరెక్టర్ కి ఉన్నాయా ? అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర చూపిస్తారు అనీ బాలయ్య ని హీరోగా పెట్టి తీస్తారు అనీ అంటున్నారు, మరి ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో చెప్పులు వేయించుకున్న సన్నివేశాలు ఏం చేస్తారో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here