వినాయక్ కి దూరంగా పారిపోతున్న తెలుగు హీరోలు

స్టార్ హీరోలకంటే స్టార్ డైరెక్టర్ లకే ఎక్కువ డిమాండ్ ఉంటున్న రోజులు ఇవి. పేరున్న డైరెక్టర్ ల కోసం హీరోలు కావాలంటే షెడ్యూల్ మార్చుకుని, కాల్ షీట్ కొట్టేసుకుని, టైం సర్దుబాటు చేసుకుంటున్నారు. అలాంటి టైం లో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మరొక హీరో కోసం లేదా హీరోల కోసం ఎదురు చూస్తున్నాడు అంటే నమ్ముతారా ? సంక్రాంతికి విడుదల అయ్యి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి డైరెక్టర్ వినాయక్ ఇప్పటి వరకూ తన కొత్త సినిమా ఏంటో చెప్పడం లేదు.

ఈ సినిమా వచ్చి వెళ్లి మూడు నెలలు అవుతోంది. ఈ మూడు నెలల్లో వినాయక్ కొత్త సినిమా విశేషాలు ఏవీ తెలియరాలేదు. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరం తేజ తో సినిమా సినిమా ఉంది అనే న్యూస్ వినపడింది కానీ అది కూడా ఎక్కడా ఓకే అయినట్టు కనపడలేదు. ఫ్లాపుల్లో ఉన్న తేజు కూడా వినాయక్‌కు డేట్లు ఇవ్వలేదు. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ‘జవాన్’ మొదలుపెట్టేశాడు. మరి వినాయక్ తో సినిమా తీసే సాహసం ఏ హీరో చేస్తాడో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here