సంపూర్నేష్ బాబు కి మహేష్ ఫాన్స్ వార్నింగ్ !

గత ఎనిమిది నెలలుగా ఈ రోజు కోసమే మహేష్ బాబు అభిమానులు పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద వారు కోరుకున్నట్టే మురుగదాస్ – మహేష్ కాంబినేషన్ లో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవాళ సాయంత్రం విడుదల కాబోతోంది.
ఏప్రిల్ 14 న అంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి ఈ ఫస్ట్ లుక్ రాబోతూ ఉండగా ఈ అనౌన్స్పెంట్ రాగానే తన సినేఅమ టీజర్ , సాంగ్ కూడా వదులుతా అంటూ ప్రకటన చేసిన సంపూర్నేష్ బాబు మీద మహేష్ ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. మహేష్ తో సంపూ కి పోటీ అంటూ వచ్చిన న్యూస్ ల మీద కూడా వారు కోప్పడుతున్నారు.
మహేష్ కీ సంపూ కీ సంబంధం ఏంటి అని ? మహేష్ తో సంపూ కి పోటీ అంటూ రాసిన వెబ్ మీడియా మీద మహేష్ ఫాన్స్ ఘరం గా ఉన్నారు.
మహేష్ రాక రాక వస్తుంటే ఆ టైం ని తనకోసం ఉపయోగించుకుంటున్న సంపూర్నేష్ బాబు కి అతని ఫెస్బూక్ ద్వారా సీరియస్ సందేశాలు పంపిస్తున్నారట. చీప్ గా ప్రవర్తించడం కరక్ట్ కాదు అనీ కావాలంటే రేపు ఈ సాంగ్ ని విడుదల చేస్కో మేము కూడా ఆదరిస్తాం అంటూ అతనికి ఒకటైపు వార్నింగ్ ఇస్తున్నారు ఫాన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here