రాజమౌళి ప్లాస్మా ఎందుకు ఇవ్వలేదో తెలుసా..?

మందులేని కరోనా మహమ్మారిని అంతమొందిచడానికి ఇప్పుడున్న ఏకైక అస్త్రం ప్లాస్మా థెరపి. కరోనా బారిన పడి…  కోలుకున్న వ్యక్తిలో ఏర్పడే యాంటీ బాడీలు ఇతర కరోనా రోగుల శరీరాల్లోకి ఎక్కించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.. దీన్నే ప్లాస్మా  థెరపీ అంటారు. ఈ క్రమంలో ప్లాస్మా దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సెలెబ్రిటీలు పిలుపునిస్తున్నారు.

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబం ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కీరవాణి, అతని తనయుడు భైరవ ప్లాస్మా దానం చేశారు. రాజమౌళి కూడా కరోనా నుంచి కోలుకున్నా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోలేదు. తాను ప్లాస్మా దానం చేయకపోవడానికి గల కారణం తెలుపుతూ రాజమౌళి ట్వీట్ చేశాడు. కీరవాణి, భైరవ ప్లాస్మా దానం చేస్తుండగా తీసిన ఫోటోలను పోస్ట్ చేస్తూ…

‘నా శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉన్నాయి, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలి. పెద్దన్న కీరవాణి, భైరవ ఈ రోజు (మంగళవారం) ఉదయం ప్లాస్మా దానం చేశారు’ అని జక్కన్న పేర్కొన్నారు.

ఇక మరో ట్వీట్ లో.. ‘కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడండి. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని’ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here