చీరకట్టులో తళుక్కుమన్న ‘మహానటి’..!

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి కీర్తి సురేశ్. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి లక్కీ గర్ల్గా పేరు తెచ్చుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ చిన్నది. ఈ సినిమాకు కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘పెంగ్విన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి ప్రస్తుతం చేతిలో ఏకంగా ఐదు సినిమాలతో బిజీ హీరోయిన్గా మారింది.

ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే కీర్తి.. తాజాగా ఓనం పండుగను పురస్కరించుకొని చీరకట్టులో దిగిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ చీరలో విరబోసిన కురులతో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులందరికీ ఓనం పండగ శుభాకాంక్షలు తెలిపింది. కీర్తి చీరకట్టు ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here