థ్రిల్లర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రానా.!

కెరీర్‌ తొలినాళ్ల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ హీరో రానా దగ్గుబాటి. ఇక విరాట పర్వం, హిరణ్య కశిప వంటి భారీ చిత్రాలను లైన్‌లో పెట్టిన రానా తాజాగా మరో భారీ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.

తమిళ దర్శకడు మిళింది రావు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో తెరకెక్కించనున్నారు. మిళింది గతంలో సిద్ధార్థ్‌ హీరోగా ‘గృహం’ చిత్రాన్ని నిర్మించాడు. హర్రర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాతో మిళింది ప్రశంసలు అందుకున్నాడు.

ప్రస్తుతం రానాతో తెరకెక్కించనున్న సినిమా థ్రిల్లర్‌ నేపథ్యంగా ఉండనున్నట్లు సమాచారం. ఇటీవలే వివాహ బంధంతో ఓ ఇంటివాడైన రానా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటాడో చూడాలి.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here