సాహో టీఆర్‌పీ అంతలా ఎందుకు తగ్గింది.?

బాహుబాలిలాంటి సంచలన విజయం తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం ‘సాహో’. ఎన్నో అంచనాలు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయినా.. బాలీవుడ్‌లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మిశ్రమ స్పందన వచ్చినా ఈ చిత్రంతో ప్రభాస్‌ స్థాయి మరోసారి ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి తెలిసొచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా జీ తెలుగులో సాహో చిత్రం టెలికాస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే వెండితెరపై పెద్దగా ఆసక్తి చూపించని తెలుగు ప్రేక్షకులు బుల్లి తెరపై కూడా ఈ సినిమాను పెద్దగా చూడలేదని టీఆర్‌పీ రేటింగ్‌ ఆధారంగా అర్థమవుతోంది. ఈ సినిమా 5.8 టీఆర్‌పీ రేటింగ్‌ సాధించింది. ఇదిలా ఉంటే అదే రోజు మరో ఛానల్‌లో ప్రసారమైన కార్తికేయ హీరోగా నటించిన గుణ 369 చిత్రానికి 5.9 రేటింగ్‌ దక్కడం గమనార్హం. దీంతో తెలుగు ప్రేక్షకులకు సాహో చిత్రం ఎందుకు ఇంతలా నచ్చలేదనే చర్చ మొదలైంది. ఎక్కువగా ఫైట్లు, ఊహకు అందని లాజిక్‌తో కూడిన సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్‌ తర్వాతి చిత్రం రాధేశ్యామ్‌.. భాషలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here