ఆకట్టుకుంటోన్న ‘కపటధారి టీజర్‌’..!

చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతమైన హీరో సుమంత్‌.. ‘సుబ్రమణ్యపురం’, ‘ఇదంజగత్‌’ వంటి విభిన్నమైన చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు. తాజాగా ఇదే దారిలో మరో సస్పెన్స్‌ చిత్రంలో నటిస్తున్నాడీ అక్కినేని నట వారసుడు. సుమంత్‌ హీరోగా తాజాగా ‘కపటధారి’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘కావలుధారి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా విడుదల చేసింది. క్రైమ్‌ సస్పెన్స్‌ నేపథ్యంలో ఉన్న ఈ టీజర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నింటికీ ఓ కారణం ఉంటుంది’ అని సుశాంత్‌ చెప్పే డైలాగ్‌ ఆసక్తి కలిగిస్తోంది. ఇక టీజర్‌ను గమనిస్తే.. ఓ హత్య కేసును ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ అయిన సుమంత్‌ ఆసక్తి చూపుతుంటాడు.. దానికి పోలీస్‌ ఆఫీసర్లు వద్దని వారిస్తుంటారు. దీంతో సుమంత్‌ సొంతంగా తానే ఆ హత్య కేసును చేధిస్తాడని తెలుస్తోంది. ఈ టీజర్‌ను గమనిస్తే.. సుమంత్‌ నుంచి మరో మంచి క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వస్తుందన్న విషయం అర్థమవుతోంది. మరి ఈ చిత్రం సుమంత్‌ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here