సోనూ ప్రొడ్యూసర్ల నుంచి తీసుకొని.. పేదలకు పంచుతున్నాడా?

కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుంటూ రియల్‌ హీరోగా మారాడు సోనూసూద్‌. గతకొన్ని రోజులుగా ఎవరో ఒకరికి సేవ చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న సోనూసూద్‌ తాజాగా తన రెమ్యునరేషన్‌తో తొలిసారి వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం సోనూసూద్‌ తెలుగులో వరుస సినిమాలకు సైన్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. ఈ రియల్‌ లైఫ్‌ హీరో బోయ‌పాటి శ్రీను-బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించాలని సోనూను కోరగా.. రూ.4 కోట్లు రెమ్యునరేషన్‌ను డిమాండ్‌ చేశాడని సమాచారం. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీను హీరోగా తెరకెక్కనున్న ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో కూడా సోనూ నటిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎంత తీసుకోనున్నాడో తెలియాల్సి ఉంది. ఇది చూసిన వారు సోనూసూద్‌ ప్రొడ్యూసర్ల నుంచి భారీ మొత్తంలో తీసుకుంటూ.. పేద ప్రజలకోసం పంచి పెడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here