రాజమౌళి అందుకే కూల్ గా ఉన్నాడా..?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట్లో ఎంత వైరల్ గా మారిందో.. దీని చుట్టూ కాంట్రవర్సీలు కూడా అదే స్థాయిలో చుట్టుముట్టాయి. టీజర్ చివరిలో ఎన్టీఆర్ ముస్లిం క్యాప్ ధరించి ఉండడంతో వివాదానికి తెర లేచింది. హిందువైన కొమరం భీమ్ ముస్లిం క్యాప్ ను ఎలా ధరిస్తారని.. కొందరు నిరసనకు దిగారు. వెంటనే సినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగించాలని, లేదంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ అంశంపై రాజమౌళి ఇప్పటి వరకు అధికారికంగా స్పందించక పోవడం గమనార్హం. అయితే కథ ఆధారంగా కొమరం భీం కొన్నేళ్లపాటు మహారాష్ట్రలో అజ్ఞాతవాసంలో ఉంటాడట.. దీంతో తాను ముస్లింగా వేషం మారుస్తాడని, అందుకే ఆ గెటప్ లో ఉంటాడని ఓ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ను.. అంటే కొమరం భీమ్ పాత్రను పూర్తిస్థాయిలో ముస్లింగా చూపడం లేదు కాబట్టే.. అది కథలో ఒక భాగం కావడం వల్లే రాజమౌళి ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాత ఈ క్యాప్ వ్యవహారంపై అందరికీ ఓ క్లారిటీ వస్తుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here