విలన్ గా రమ్యకృష్ణ..?

ఒకప్పుడు దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించి అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి రమ్యకృష్ణ. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతోందీ అలనాటి అందాల తార. బాహుబలిలో శివగామి పాత్రతో ఒక్కసారిగా మళ్లీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత వరుస ఆఫర్లతో వెండితెరపై కనువిందు చేస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది.
ఇక మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ప్రస్థానం ఫేమ్.. దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కావడం విశేషం. గతంలో రజనీ కాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించి మెప్పించిన రమ్యకృష్ణ మరోసారి అలాంటి పాత్రలో నటించనుండడం విశేషం. మరి ఈ సినిమాతో రమ్యకృష్ణ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here