నా పెళ్లి గురించి మీడియా వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది..!

గతకొన్ని రోజులుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ వివాహం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏమంటూ‌ తేజ్‌ పుట్టిన రోజున మెగాస్టార్ చిరంజీవి ఆయన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడో అప్పటి నుంచి సాయి ధరమ్‌ తేజ్‌ వివాహం చుట్టే వార్తలు తిరుగుతున్నాయి. తేజ్‌ త్వరలోనే వివాహం చేసుకోనున్నాడని వార్తలు రాగా.. తర్వాత అసలు ఆయనకు ఇప్పట్లో పెళ్లి గురించి ఆసక్తిలేదని మరికొన్ని వార్తలు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై సాయి ధరమ్‌ తేజ్‌ అధికారికంగా స్పందించాడు. ఈ విషయమై తేజ్‌ మాట్లాడుతూ.. ‘నాకు త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు. తగిన వధువును వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దానికి నేను ఓకే చెప్పాను అంతే. ఇక నా పెళ్లి విషయంలో ఇన్ని రూమర్లు రావడానికి కారణం.. నా వివాహంపై మీడియా వాళ్లే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఇన్ని రూమర్లు వస్తున్నాయి’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘సోలే బతుకే సో బెటర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత దేవకట్ట దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here