పవన్‌కు జోడిగా సాయి పల్లవి..?

పవన్‌ కళ్యాణ్‌, రానాలు హీరోలుగా మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్‌కు జోడిగా సాయి పల్లవి నటించనుందని తెలుస్తోంది. ఈ విషయమై సినిమా యూనిట్‌ సాయిపల్లవిని సంప్రదించగా దానికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావడమే బ్యాలెన్స్‌ ఉంది.

ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న వేదాళం రీమేక్‌లో చిరు సోదరిగా సాయి పల్లవి నటించనుందని గత కొన్ని రోజులుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే చివరి క్షణంలో ఈ అవకాశాన్ని కీర్తి సురేష్‌ కొట్టేసింది. చిరు కూడా కీర్తికి ఓకే చెప్పడంతో సాయి పల్లవిని ఈ సినిమా నుంచి తప్పించారని చర్చ జరిగింది. అయితే మెగాస్టార్‌ సినిమాలో అవకాశం కోల్పోయినా.. పవర్‌ స్టార్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది సాయి పల్లవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here