పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌ బై చెబుతూ టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూని ఈ నెల 30 (శుక్రవారం) వివాహం చేసుకోనుంది. కరోనా నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా కాజల్‌ ఇంట్లోనే వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. ఇప్పటికే వివాహ కార్యక్రమాలన్నీ పూర్తికాగా బుధవారం కాజల్‌ ఇంట్లో సంగీత్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోను తాజాగా కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.

చేతులకు వేసుకున్న మెహందీని చూపుస్తూ దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో కాజల్‌ చిరు నవ్వులు చిందుస్తూ కనిపిస్తోంది. దీంతో కాజల్‌కు పెళ్లి కళ వచ్చేసిందంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు హాజరవుతుండగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హాజరు కానున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here